V Epiq Theater: నెల్లూరు జిల్లాలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు ఎఫెక్ట్

V Epiq Theater: ఆసియాలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ స్క్రీన్ కలిగిన బాహుబలి థియేటర్ మూసివేత

Sandeep Eggoju
Updated on: 25 Dec 2021 9:30 PM IST
Asias Largest screen V Epiq Theater Closes in Nellore | AP Online News
X

సూళ్లూరుపేటలోని వెంపిక్ మల్టీఫ్లెక్స్ మూసివేత

V Epiq Theater: ఆసియాలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ స్క్రీన్ కలిగిన బాహుబలి థియేటర్‌ను మూసివేశారు. నూతన టికెట్టు విధానానికి నిరసనగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని వెంపిక్ మల్టీఫ్లెక్స్‌ను మూసివేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నూతన టికెట్ ధరలకు నిరసనగా థియేటర్ క్లోజ్‌పై ఇండస్ట్రిలో పెద్ద ఎత్తు చర్చ జరుగుతుంది. ప్రభుత్వ ధరల ప్రకారం థియేటర్లను నిర్వహించలేమని ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చాలా సినిమా హాల్స్ మూసివేశారు.

అయితే ఆసియాలోనే అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ కలిగిన వీఎపిక్ మల్లీఫ్లెక్స్ బాహుబలి థియేటర్ మూసివేతతో ప్రేక్షకుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. మరోవైపు పదేపదే అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండటం, ధరల స్థిరీకరణతో తాము థియేటర్ను నిర్వహించలేకపోతున్నామని యాజమాన్యం చెబుతోంది. టికెట్ల రేట్లపై కాకుండా థియేటర్ ప్రాంగణంలో ఉండే ఫుడ్ కోర్ట్స్‌పై దృష్టి పెట్టాలని థియేటర్స్ నిర్వహకులు కోరుతున్నారు. సినిమా కోసం ప్రేక్షకులు టికెట్ ధరలను భరించగలరని అయితే అక్కడ అమ్మె తినుబండారాల ధరలను కంట్రోల్ చేయాలని కోరారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story