Asian Games 2023: సీఎం జగన్‌ను కలిసిన ఏషియన్‌ గేమ్స్‌ క్రీడాకారులు

Asian Games 2023: వివిధ క్రీడల్లో బంగారు, రజత పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు

Jyothi
Published on: 20 Oct 2023 2:25 PM IST
Asian Games Athletes Meet CM Jagan
X

Asian Games 2023: సీఎం జగన్‌ను కలిసిన ఏషియన్‌ గేమ్స్‌ క్రీడాకారులు

Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు సీఎం జగన్‌ను క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన అభినందించారు. వివిధ క్రీడల్లో బంగారు, రజత పతకాలు సాధించిన కోనేరు హంపి, అనూష, జ్యోతి, సాకేత్ సాయి, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, ధీరజ్‌లను సీఎం జగన్ అభినందించారు. తాము పొందిన మెడల్స్‌ను సీఎం జగన్‌కు చూపించారు క్రీడాకారులు.

జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ... క్రీడలకు మరింత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.

Jyothi

Jyothi

Next Story