Kothakota: పీఎస్‌లోనే ఏఎస్‌ఐ రాసలీలలు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సీఐ

Kothakota: అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ అప్పారావు ఓ మహిళతో అడ్డంగా దొరికిపోయాడు.

Arun Chilukuri
Published on: 29 Aug 2022 3:08 PM IST
Asi Caught With A Woman In Kothakota Police Station In Anakapalle District
X

Kothakota: పీఎస్‌లోనే ఏఎస్‌ఐ రాసలీలలు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సీఐ

Kothakota: అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ అప్పారావు ఓ మహిళతో అడ్డంగా దొరికిపోయాడు. మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐ రాత్రి ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. అక్కడే రాసలీలలు జరిపాడు. అది గమనించిన స్థానికులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్టేషన్‌కు చేరుకున్న ఉన్నతాధికారులు అప్పారావును రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. దీంతో ఏఎస్ఐ సీఐ కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. అప్పరావుని CI అహ్మద్, SI అప్పలనాయుడు తీవ్రంగా మందలించారు. మరోవైపు ఆ మహిళ అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. అయితే ఏఎస్ఐపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story