Mansas Trust: మాన్సాస్‌ ఛైర్మన్‌ హోదాలో కోటలో ప్రవేశించిన అశోక్‌ గజపతిరాజు

Mansas Trust: మాన్సాస్‌ ఛైర్మన్‌ హోదాలో అశోక్‌ గజపతిరాజు కోటలో ప్రవేశించారు.

Arun Chilukuri
Published on: 17 Jun 2021 12:49 PM IST
Ashok Gajapati Raju Enters Mansas Trust as Chairman
X

Mansas Trust: మాన్సాస్‌ ఛైర్మన్‌ హోదాలో కోటలో ప్రవేశించిన అశోక్‌ గజపతిరాజు

Mansas Trust: మాన్సాస్‌ ఛైర్మన్‌ హోదాలో అశోక్‌ గజపతిరాజు కోటలో ప్రవేశించారు. మాన్సాస్‌ కార్యాలయంలోకి ఛైర్మన్ హోదాలో వెళ్లారు. ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసేందుకు అశోక్‌ గజపతిరాజు కార్యాలయానికి వెళ్లినా.. సిబ్బంది ఎవరు అందుబాటులో లేరు. మాన్సాస్ సిబ్బంది గైర్హాజరవ్వడంతో అశోక్‌ గజపతి రాజు ప్రమాణస్వీకారం కాస్త ఆలస్యంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్ధ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లించామన్నారు. దోపిడిదారులకు మాన్సాస్‌లో స్థానం లేదని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. రామతీర్థం విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల కరోనా నుంచి కోలుకోవడం సంతోషంగా ఉందన్నారు. మాన్సాస్ చైర్మెన్‌గా తమ ప్రథమ ప్రాధాన్యం విద్యకేనన్నారు. దాని కోసం ప్రభుత్వ సహకారాన్ని కూడా అర్ధిస్తామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story