సంచయితపై ఘాటుగా స్పందించిన అశోక్‌గజపతిరాజు

సంచయితపై ఘాటుగా స్పందించిన అశోక్‌గజపతిరాజు
x
Highlights

విజయనగరం మాన్సస్ ట్రస్ట్‌ బోర్డు పంచాయితీ తారా స్థాయికి చేరింది. సోషల్ మీడియాలో పోస్ట్‌ పెడుతున్న సంచయిత పై అశోక్‌గజపతి రాజు ఘాటుగా స్పందించారు....

విజయనగరం మాన్సస్ ట్రస్ట్‌ బోర్డు పంచాయితీ తారా స్థాయికి చేరింది. సోషల్ మీడియాలో పోస్ట్‌ పెడుతున్న సంచయిత పై అశోక్‌గజపతి రాజు ఘాటుగా స్పందించారు. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌ను తమ తండ్రి పీవీజీ రాజు ఏర్పాటు చేశారని అశోక్‌గజపతిరాజు తెలిపారు. చట్టవిరుద్దంగా, అర్ధరాత్రి జీవోలు ఇచ్చి సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా టెంపుల్స్ ఛైర్మన్‌గా ఉన్న తనను.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తొలగించారన్నారు. ఛైర్మన్ పోస్ట్ అపాయింటింగ్ పోస్ట్ కాదు, ఆనవాయితీగా వచ్చే పోస్ట్‌ అని మండిపడ్డారు. సంచయిత 105 ఆలయాల్లో ఒక్క పండక్కి కూడా హాజరుకాలేదని అశోక్ గజపతి రాజు అన్నారు. ఆలయాలు తమ సొంతవి కావని, భక్తులవన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు మంచివి కావన్నారు.

చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ సంచయితను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో మీ తండ్రి ఎవరో మీరే పోస్టు చేశారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పోస్టులే మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి. ఎవరో పెట్టిన పోస్టులకు నేను సమాధానం చెప్పడం నా ఖర్మ. ఒక్కోచోట ఒక్కో విధంగా తండ్రి పేరు మార్చే పిల్లలను నేనెక్కడా చూడలేదు. తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు. తండ్రి, తాతను సంచయిత ఒక్కసారైనా కలవలేదు. తమ పూర్వీకులు నిర్వీహించే ఆలయాలకు ఒక్కసారి కూడా రానివారు.. వాటి ఆస్తులపై కన్నేయడం బాధాకరం. మాన్సాస్ ఛైర్మన్ హోదా అన్నది ప్రభుత్వం కల్పించిన పదవి కాదు. ట్రస్టు నియామకాల్లో ప్రభుత్వ నియంతృత్వ ధోరణితో వ్యవహరించిందని అశోక్‌గజపతిరాజు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories