కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆశ వర్కర్‌కు తీవ్ర అస్వస్థత

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆశ వర్కర్‌కు తీవ్ర అస్వస్థత
x

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆశ వర్కర్‌కు తీవ్ర అస్వస్థత


Highlights

ఈ నెల 19న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశ వర్కర్ తీవ్ర అస్వస్థతకు గురైంది. తాడేపల్లి మండలం పెనుమాక ఆశ వర్కర్‌గా విజయలక్ష్మీ పనిచేస్తున్నారు. రెండు...

ఈ నెల 19న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశ వర్కర్ తీవ్ర అస్వస్థతకు గురైంది. తాడేపల్లి మండలం పెనుమాక ఆశ వర్కర్‌గా విజయలక్ష్మీ పనిచేస్తున్నారు. రెండు రోజులు ఆమె ఆరోగ్యం బాగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 21 తెల్లవారు జామున చలి జ్వరంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయినట్లు విజయలక్ష్మి కుమారుడు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునే ముందు విజయలక్ష్మికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. అయితే విజయలక్ష్మి అనారోగ్యానికి కారణం వ్యాక్సిన్ కాదన్న వైద్యులు ఆమెకు అన్నిరకాలుగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories