Andhra Pradesh: ఏపీ బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ నియామకం

Andhra Pradesh: కోర్‌ కమిటీని ప్రకటించిన జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్

Sandeep Eggoju
Published on: 29 Nov 2021 9:33 PM IST
Arun Singh Announced the AP BJP Core Committee
X

ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ నియామకం (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి కోర్ కమిటీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటించారు. ఈ కమిటీలో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సత్యకుమార్‌ సభ్యులుగా ఉన్నారు. ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులను కూడా సభ్యులుగా నియమించారు. కోర్‌ కమిటీలో మధుకర్, మాధవ్, జయరాజు, చంద్రమౌళి, రేలంగి శ్రీదేవిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా శివప్రకాష్‌‌, మురళీధరణ్, సునీల్‌ దేవధర్‌ను నియమించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story