Arogyasree in AP Breaking News Update: ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్య శ్రీ

Arogyasree in AP Breaking News Update: ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్య శ్రీ
x
AROGYA SREE IN AP
Highlights

Arogyasree in AP Breaking News Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోగానికి సంబంధించి ఖర్చు రూ. 1000 దాటితే.. వారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తామని సీఎం జగన్ అప్పట్లో ప్రకటించారు.

Arogyasree in AP Breaking News Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోగానికి సంబంధించి ఖర్చు రూ. 1000 దాటితే.. వారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తామని సీఎం జగన్ అప్పట్లో ప్రకటించారు. 2020, జులై 08వ తేదీన ఆరు జిల్లాల్లో వర్తింపు చేస్తామని, మిగిలిన 6 జిల్లాలో దీపావళి, నవంబర్‌ 14 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. అనుకున్నట్టే గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డా. మల్లికార్జున్‌ సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ పథకం

అమలుపై ఆయన ద్వారా సీఎం ఆరా తీశారు. గతంలో చెప్పినట్టుగానే మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీని విస్తరించాలని ఆదేశించారు. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపుచేస్తామని వైసీపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 2020 జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ప్రాజెక్టుగా చేపట్టారు. ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేర్చింది. ఇటీవల కోవిడ్ ను కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories