AP: జమ్మూకశ్మీర్ ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లా ఆర్మీ జవాను మృతి

AP: జమ్మూకశ్మీర్ ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లా  ఆర్మీ జవాను మృతి
x
Highlights

AP: జమ్మూకశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను పంగల కార్తీక్ అనే...

AP: జమ్మూకశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను పంగల కార్తీక్ అనే ఆర్మీ జవాను అమరుడయ్యారు. అధికారులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..భద్రతా దళాలు ఆదివారం రాత్రి సోపోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలూర గుజ్జర్ పటి ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా..ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో జవాను పంగల కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత ధైర్యసాహసాలతో పోరాడి ప్రాణత్యాగం చేసిన కార్తీక్ కు భద్రతా దళాలు నివాళులు అర్పించాయి.

బంగారుపాళ్యం మండలంలోని ఎగువ రాగిమానుపెంట గ్రామానికి చెందిన కార్తీక తల్లిదండ్రులు వరదరాజులు, తల్లిసెల్వీలది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ మధ్యలో ఆపేసి 2017లో సైన్యంలో చేరిన కార్తీక్ ప్రస్తుతం కాశ్మీర్ లో పనిచేస్తున్నారు. సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని గ్రామ సర్పంచి శ్రీహరి తెలిపారు. మృతదేహం 3 రోజుల్లో స్వగ్రామానికి వస్తుందని తెలిపారు. కార్తీక్ మరణంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రత్యేక ఆపరేషన్ లో ఉన్నా..ఇక్కడ చాలా రిస్కు ఉందని ఆదివారమే తన కుమారుడు మాట్లాడాడని కార్తీక్ తండ్రి వరదరాజులు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ఇంటి వస్తానని చెప్పి ఇంతలోనే ఈ ఘోరం జరిగిందంటూ వాపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories