Jawan Sai Teja Father: సాయిని బిపిన్ బిడ్డలా చూసుకునేవారు, కన్నీటి పర్యంతమయిన తండ్రి..

Jawan Sai Teja Father: ప్రధాని సెక్యూరిటీ వింగ్ లోకి చేర్చుతానన్న బిపిన్...

Shireesha
Updated on: 11 Dec 2021 7:30 PM IST
Army Chopper Crash Victim Jawan Sai Teja Father Mohan about Bipin Rawat and Sai Teja | Live News
X

Jawan Sai Teja Father: సాయిని బిపిన్ బిడ్డలా చూసుకునేవారు, కన్నీటి పర్యంతమయిన తండ్రి..

Jawan Sai Teja Father: సాయితేజ ఆశయాలే కాదు ఆయన పరిచయాలూ అమోఘమని తెలుస్తోంది. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి సైన్యంలో చేరాలని పట్టుదల పెంచుకున్న సాయితేజ అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ వచ్చాడు. సాదారణ సిపాయిగా చేరి త్రివిధ దళాలకు నాయకత్వం వహించే ఛీఫ్ కు సైనిక రక్షణలో విధులు నిర్వర్తించే స్థాయికి ఎదిగాడు. మరో మూడు నెలలు దాటితే అతను ప్రధాని భద్రతా విభాగంలో చేరేవాడని తెలుస్తోంది.

ఈ ఘటన జరిగి ఉండకపోతే అతని భవిష్యత్తు మరోలా ఉండేదంటున్నాడు సాయితేజ తండ్రి మోహన్. సాయితేజ తనతో చెప్పిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన హెచ్.ఎం.టివితో పంచుకున్నారు. బిపిన్ రావత్ సాయిని బిడ్డలాగా చూసుకుంటున్నారని ఆయన పదవీ విరమణ తరువాత ప్రధాని సెక్యూరిటీ విభాగంలో చేర్చుతానన్నారని సాయి చెప్పారని మోహన్ అన్నారు.

Shireesha

Shireesha

Next Story