విద్యుత్ వినియోగదారులకు ఊరట.. మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులపై క్లారిటీ

విద్యుత్ వినియోదారులకు ఉపశమనం కల్పించే వార్త అందించారు.

Samba Siva Rao
Updated on: 6 May 2020 9:39 PM IST
విద్యుత్ వినియోగదారులకు ఊరట.. మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులపై క్లారిటీ
X
Representational Image

విద్యుత్ వినియోదారులకు ఉపశమనం కల్పించే వార్త అందించారు. మార్చ్, ఏప్రిల్ నెలల సంబంధించిన కరెంటు బిల్లులు కలిపి ఇస్తారని వస్తున్న వార్తలు కేవలం అపోహలు మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌ కో సీఎండీ నాగుల శ్రీకాంత్‌ వెల్లడించారు. రెండు నెలల బిల్లులు విడివిడిగా లెక్క కట్టినట్లు చెప్పారు. మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన బిల్లులు అదనంగా వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

మార్చ్, ఏప్రిల్ నెలలకు 50 శాతంగా బిల్లులు లెక్క కట్టి ఇవ్వడంతో స్లాబ్‌ మారే అవకాశం లేదని సీఎండీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. గత 5ఏళ్లుగా మార్చిలో 46 శాతం, ఏప్రిల్‌లో 54 శాతం వినియోగం ఉంటుందని, ఏప్రిల్‌లో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో వచ్చినట్లు స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారులకు అనుకూలంగానే బిల్లింగ్ చేశామని, ఎక్కడా యూనిట్ కు కూడా అదనంగా బిల్లింగ్ చేయలేదని సీఎండీ శ్రీకాంత్ చెప్పారు. వినియోగదారులకు బిల్లులపై ఎమైనా అపోహాలు ఉంటే 1912కి డయల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏప్రిల్‌కు బిల్లులు విడివిడిగానే sms చేస్తాం అని స్పష్టం చేశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story