ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు.. పెరిగిన రేట్లు ఇవే..

ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు.. పెరిగిన రేట్లు ఇవే..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో బస్ ఛార్జీలు పెరగానున్నాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు పది పైసలు పెంచారు. మిగతా బస్సులో కిలో మీటర్ కు 20 పైసలు...

ఆంధ్రప్రదేశ్ లో బస్ ఛార్జీలు పెరగానున్నాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు పది పైసలు పెంచారు. మిగతా బస్సులో కిలో మీటర్ కు 20 పైసలు పెంచారు. బస్సు చార్జీల పెంపుకు సీఎం జగన్ ఆమోదించారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. బస్సు ఛార్జీలు పెంచకుంటే ఆర్టీసీ గట్టెక్కడం కష్టం అన్నారు. పెరిగిన బస్ ఛార్జీలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో త్వరగా తెలుపుతామన్నారు.

ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని, దీనివల్ల నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీకి రూ.6735 కోట్ల అప్పులున్నాయని చెప్పారు. అదీకాక ఏటా ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టాలు వస్తున్నాయని, అందువల్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.

ఇక ఇప్పటికే తెలంగాణాలో కూడా బస్ ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే.. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టేకించాలంటే చార్జీలు పెంచక తప్పదని, దీనికి ప్రజలు సహకరించాలని సీఎం కోరారు. ఇక ఇప్పుడు బస్ ఛార్జీలు విషయంలోనూ అదే పద్ధతిని ఎంచుకున్నారు ఏపీ సీఎం జగన్..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories