ఏపీఎస్ ఆర్టీసీ : నేటి నుంచి స్పెషల్ బస్సులు!

ఏపీఎస్ ఆర్టీసీ :  నేటి నుంచి స్పెషల్ బస్సులు!
x

Apsrtc 

Highlights

APSRTC Special Buses : దసరా పండగను దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ ఆర్టీసీ నేటినుంచి స్పెషల్ బస్సులను నడపనుంది. ఈ రోజు( శుక్రవారం ) నుంచి ఈ నెల 26 వరకు 1850 బస్సులను అదనంగా ఆయా రూట్లలో నడపనుంది.

APSRTC Special Buses : దసరా పండగను దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ ఆర్టీసీ నేటినుంచి స్పెషల్ బస్సులను నడపనుంది. ఈ రోజు( శుక్రవారం ) నుంచి ఈ నెల 26 వరకు 1850 బస్సులను అదనంగా ఆయా రూట్లలో నడపనుంది. ఇందులో బెంగుళూరుకి 562ప్రత్యేక బస్సులను కేటాయించినట్టుగా అధికారులు వెల్లడించారు. అయితే కరోనా తగ్గకపోవడంతో తమిళనాడు సరిహద్దు వరకే బస్సులను నడపనున్నారు.

అటు తెలంగాణ ప్రభుత్వంతో ఇంకా చర్చలు కొలిక్కి రాకపోవడంతో తెలంగాణకు మాత్రం బస్సులను నడపడం లేదు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్‌ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా ఇప్పడు మరో 1850 బస్సులు నడవనున్నాయి. తెలంగాణకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో..ప్రైవేట్ ఆపరేటర్లు పండగ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్ని తిప్పేందుకు సిద్ధమయ్యారు.

ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలవారీగా నడిపే ప్రత్యేక బస్సుల విషయానికి వస్తే.. శ్రీకాకుళం, విజయనగరం–66, విశాఖపట్నం–128, తూర్పుగోదావరి 342, పశ్చిమగోదావరి–40,కృష్ణా–176, గుంటూరు–50, ప్రకాశం–68, నెల్లూరు–156,చిత్తూరు–252,అనంతపురం–228,కర్నూలు–254, కడప–90 బస్సులు నడవనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories