APSRTC New App: డిజిటలైజేషన్ దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ సేవలు.. బస్సు టికెట్ల కోసం కొత్త యాప్

APSRTC New App: డిజిటలైజేషన్ దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ సేవలు.. బస్సు టికెట్ల కోసం కొత్త యాప్
x
Highlights

APSRTC new App: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ ( ఆర్టీసీ ) స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్ర‌యాణికుల‌కు బ‌స్సు టికెట్లు రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ‌కు ఓ యాప్ అందుబాటులోకి తీసురానుంది

APSRTC new App: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ ( ఆర్టీసీ ) స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్ర‌యాణికుల‌కు బ‌స్సు టికెట్లు రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ‌కు ఓ యాప్ అందుబాటులోకి తీసురానుంది. ప్రథమ్ పేరుతో కొత్త యాప్ ను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఇక నుంచి బస్సు టికెట్ల కోసం కొత్త యాప్‌ను వినియోగించనుంది. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది.

తొలుత విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్ల జారీని చేపట్టాలని భావించినా.. ఇప్పుడు పల్లె వెలుగుసహా అన్ని బస్సులకూ ఈ యాప్‌నే వాడాలని నిర్ణయించింది. దీనికి 'ప్రథమ్‌' అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే గమ్య స్థానాల‌ను ఈ యాప్‌లో నమోదు చేస్తే ఏయే బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయనేది చూపిస్తుంది. అప్పుడు బస్సును ఎంపిక చేసుకుని టికెట్‌ కొనుగోలు చేయవచ్చు.. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపాలి. టికెట్‌ జారీ అయినట్లు మెసేజ్‌తోపాటు నాలుగు అంకెల పిన్‌ నంబరు వస్తుంది. ప్రయాణికుడు బస్‌ ఎక్కే సమయంలో డ్రైవర్‌కు పిన్‌ నంబరు చెబితే సరిపోతుంది.

ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో రాష్ట్రంలో కండక్టర్ల ఉద్యోగాలు ప్ర‌మాదంలో ప‌డ్డాయి. ఏపీఎస్ ఆర్టీసీ ప‌ల్లెవెలుగుతో పాటు సిటీ, బ‌స్సులు , డిల‌క్స్ , ఆల్ట్రా డిల‌క్స్ ల్లో కూడా ఈ సిస్టం అమ‌లు చేస్తే ప్ర‌యాణికులు ఇళ్ల‌నుంచే టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే వేలాది మంది కండెక్ట‌ర్ల ఉద్యోగాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మారోవైపు చాలా మంది వ‌ద్ద స్మాట్ ఫోన్స్ ఉండ‌టంతో వారు యాప్ ద్వారా టీకెట్ బుక్ చేసుకుంటారు. అయితే ప‌ల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బ‌స్సుల్లో ఈ సిస్టం అమలు చేస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌యాణించే ప్రజ‌ల‌కు సాంకేతిక ప‌రిజ్యానం ఉప‌యోగించుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories