Coronavirus Updates in AP: ఏపీలో మరో 648 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Published on: 30 Jun 2020 12:44 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో మరో 648 కరోనా పాజిటివ్‌ కేసులు
X

648 new coronavirus cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 648 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18,114 శాంపిల్స్‌ని పరీక్షించగా 648 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 258 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, అనంతపురం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 12,202. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 187. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5245కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 6770 మంది చికిత్స పొందుతున్నారు.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story