APSRTC: పూర్తిస్థాయి సీటింగ్ సామర్ధ్యంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు...

APSRTC: పూర్తిస్థాయి సీటింగ్ సామర్ధ్యంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు...
x
Highlights

APSRTC: అన్‌లాక్ 4.0 నేపథ్యంలో బస్సులను 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతించే కీలక నిర్ణయం ఏపీఎస్ఆర్టీసీ తీసుకుంది.

APSRTC: అన్‌లాక్ 4.0 నేపథ్యంలో బస్సులను 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతించే కీలక నిర్ణయం ఏపీఎస్ఆర్టీసీ తీసుకుంది. ఇంతకు ముందు, లోక్ డౌన్, తర్వాత మే 21 నుండి ఆర్టీసీ సేవలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, కోవిడ్ నిబందనలు ప్రకారం సగం సీట్లు ను మాత్రమే అనుమతించబడ్డాయి, సగం సీట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి సామర్థ్యంతో సీట్లు కేటాయించాలని ఇటీవల నిర్ణయించారు. దీనితో, అన్ని సీట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా మార్పులు చేయబడతాయి.

కరోనావైరస్ వ్యాప్తి మధ్య లాక్ డౌన్ విధించిన కారణంగా మార్చి చివరి నుండి మే 21 వరకు బస్సులను అనుమతించలేదు. అయితే, మే 21 న, ఆర్టిసి బస్సులు సెప్టెంబర్ 19 నుండి విజయవాడ,విశాఖపట్నంలో ప్రారంభించారు.. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని చోట్ల, మిగిలిన పట్టణాలలో కూడా సేవలు ప్రారంభమయ్యాయి. నగరాల్లో కూడా సేవలను ప్రారంభించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భౌతిక దూరాన్ని అనుసరించేటప్పుడు మాస్క్, శానిటైజర్లు వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇక పొతే ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,228 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కేసుల సంఖ్య 6,46,530 కు చేరుకుంది. ఇందులో 70,357 యాక్టివ్ కేసులో ఉండగా 5,70,667 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. తాజాగా మరో 45మంది కరోనాతో పోరాడి మృతి చెందారు.. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,506కి చేరుకుంది.. ఇక గడచిన 24 గంటల్లో 68,829 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 53,02,367 కి చేరుకుంది.. 8,291 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories