ఏపీకి ప్రత్యేక బస్సులు తాత్కాలికంగా వాయిదా

ఏపీకి ప్రత్యేక బస్సులు తాత్కాలికంగా వాయిదా
x
Highlights

కరోనా వ్యాప్తి లాక్‌డౌన్‌ కారణంతో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయారు.

కరోనా వ్యాప్తి లాక్‌డౌన్‌ కారణంతో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయారు. కాగా హైదరాబాద్ లో చిక్కుకుపోయిన వారిని సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఏపీఎస్‌ఆర్టీసీ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. హైద్రాబాద్ నుంచి సర్వీసులు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మళ్లీ ఎప్పటినుంచి నడుపుతామనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆర్జీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ బస్సు సర్వీసులు మియాపూర్‌-బొల్లారం క్రాన్‌రోడ్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌, ఎల్బీనగర్‌లలో ప్రయాణికులతో ప్రారంభమవుతాయి.ఇప్పటివరకు స్పందన ద్వారా హైదరాబాద్ నుంచి 8వేల మంది, రంగారెడ్డి జిల్లా నుంచి 5వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ 13వేలమంది కోసం బస్సు సర్వీసులు నడపనుంది. మే 18 నుంచి బస్సులను రోడ్డు ఎక్కించడానికి సన్నాహాలు చేసే ఆలోచనలో ఉన్నారట. బస్సులు నడిపేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రవ్యాప్తంగా రీజనల్‌ మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేశారు. కొన్ని బస్సు సర్వీసుల్లో 50% ప్రయాణికులనే అనుమతిస్తారు.. ఈ మేరకు సీట్లను భౌతిక దూరం పాటించేలా మార్చాలని సూచనలు చేశారట.

ఇక రాష్టంలో మే 18 నుంచి బస్సులను రోడ్డు ఎక్కించడానికి సన్నాహాలు చేసే ఆలోచనలో ఉన్నారు. బస్సులు నడిపేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రవ్యాప్తంగా రీజనల్‌ మేనేజర్లకు ఉత్తర్వుకు జారీ చేశారు. కొన్ని బస్సు సర్వీసుల్లో 50% ప్రయాణికులనే అనుమతిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ తన నిర్ణయం వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories