ఏపీలో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్.. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఐటీ సేవలు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్‌ డేటా సెంటర్‌ సర్వర్‌ డౌన్‌ అయింది.

Arun Chilukuri
Published on: 14 March 2023 12:12 PM IST
APs State Data Centre Server Faces a Glitch
X

ఏపీలో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్.. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఐటీ సేవలు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్‌ డేటా సెంటర్‌ సర్వర్‌ డౌన్‌ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి. సర్వర్‌డౌన్‌తో ఉద్యోగుల అటెండెన్స్‌ యాప్‌, ఇతర వెబ్‌ ఆధారిత సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పౌర సేవలకూ అంతరాయం ఏర్పడింది. డేటా సెంటర్‌లో సర్వర్‌ ఎందుకు డౌన్‌ అయిందనే విషయంపై వివరాలు తెలియరాలేదు. ఈ సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story