APPSC: త్వరలో 1,184 పోస్టులకు నోటిఫికేషన్‌

APPSC: ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.

Arun Chilukuri
Published on: 16 July 2021 6:17 PM IST
APPSC Drops Preliminary Exams for Recruitment of Jobs in the State
X

APPSC: త్వరలో 1,184 పోస్టులకు నోటిఫికేషన్‌

APPSC: ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. గ్రూప్-1 పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా గ్రూప్-1 ఇంటర్వ్యూల స్థానంలో ఇతర విధానాన్ని అమలు చేసేలా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆగస్ట్ నుంచి అమలు చేయనున్నారు.

1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఉద్యోగాల భర్తీలో వయో పరిమితిని 47 ఏళ్ల వరకు పొడగించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ మార్పులతో పాటు ఈబీసీ రిజర్వేషన్లపై రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. గతంలో ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story