Sake Sailajanath: జ‌గ‌న్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు

Sake Sailajanath: కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ కాంగ్రెస్ విమ‌ర్శించింది.

Samba Siva Rao
Published on: 29 May 2021 12:02 PM IST
Sake Sailajanath Fire On YCP Govt
X

Sake Sailajanath File Photo

Sake Sailajanath: కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ కాంగ్రెస్ విమ‌ర్శించింది. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టిందికాంగ్రెస్ పార్టీ. విజయవాడ ఎపిసిసి భవన్ లో నిరసన కార్యక్రమం లో పాల్గొన్న సాకే శైలజానాధ్, నరహరశెట్టి నరసింహారావు, ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత, ఎపిసిసీ అధ్య‌క్షుడు శైల‌జానాథ్ మాట్లాతూ..క‌రోనాతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే ప్ర‌భుత్వాలు పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచేశారని మండిప‌డ్డారు. మోడీ పబ్లిసిటీ పిచ్చికి.. నేడు ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయిని ఆయ‌న అన్నారు.

ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయలేక పోతున్నారు..పేదలకు కరోనా సమయంలో పది‌వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలి డిమాండ్ చేశారు.జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ బాటలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమ‌ర్శ‌లు చేశారు. ధరలను అదుపు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలి కోరారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఆదర్శంగా ఉందని చెప్పడం అబద్దమ‌ని..అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలను మోసం‌ చేస్తున్నారుని శైల‌జానాథ్ అన్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story