ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ కీలక నిర్ణయం.. ఏపీ వ్యాప్తంగా...

APCC Chief: తొలి విడతగా 100 రోజుల్లో 1500 కి.మీ. నడిచేందుకు ప్రణాళిక...

Shireesha
Updated on: 19 April 2022 4:44 PM IST
APCC Chief Sake Sailajanath Planned Padayatra in AP | Live News Today
X

ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ కీలక నిర్ణయం.. ఏపీ వ్యాప్తంగా...

APCC Chief: ఏపీసీసీ(Andhra Pradesh Congress Committee) అధ్యక్షుడు శైలజానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. మే చివరి వారంలో పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తొలి విడతగా 100 రోజుల్లో 1500 కిలోమీటర్లు నడిచేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఉదయం పాదయాత్రలో ప్రజల సమస్యలు వింటూ... సాయంత్రం బహిరంగ సభలు ఉండేలా క్యాడర్‌కు సూచనలు చేశారు.

ఏపీలో కాంగ్రెస్‌(Congress) పార్టీని బలోపేతం చేసేందుకు... క్యాడర్‌లో నూతనోత్సాహాన్ని నింపేందుకు పాదయాత్రకు ప్లాన్‌ చేశారంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మే చివరి వారంలో అనంతపురం లేదా శ్రీకాకుళం నుంచి పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే పాదయాత్ర నిర్ణయాన్ని త్వరలోనే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు శైలజానాథ్(Sake Sailajanath). హైకమాండ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే పాదయాత్రపై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు.


Shireesha

Shireesha

Next Story