విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు నిరసన

Vijayawada: పార్టీ ఆఫీసును ఎండోమెంట్‌ స్వాధీనం చేసుకోవడంపై నిరసన

Jyothi
Published on: 16 Dec 2023 10:33 AM IST
APCC chief Gidugu Rudra Raju Protested at the Congress office in Vijayawada
X

విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు నిరసన

Vijayawada: విజయవాడలోని చిట్టినగర్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు నిరసనకు దిగారు. స్వాతంత్ర్యం ముందు నుంచి ఉన్న కార్యాలయాన్ని ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవడం పట్ల నిరసన చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల సమయం ఉన్నా ఎండోమెంట్ స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు.

దీంతో ఎండోమెంట్‌ ప్రయత్నాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తమకు సంబంధించిన పార్టీ కార్యాలయం అంశంలో హైకోర్టులో పిల్ వేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు మద్దతుగా జనసేన విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ పోతిన మహేష్ నిరసనలో పాల్గొన్నారు. అటు టీడీపీ నేతలు సైతం కాంగ్రెస్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story