గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్.. డీజీపీకి లేఖ రాసిన..

Mahila Commission: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది.

Arun Chilukuri
Updated on: 6 Aug 2022 3:57 PM IST
AP Women Commission Reacts on MP Gorantla Madhav Nude Video Call
X

గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్.. డీజీపీకి లేఖ రాసిన..

Mahila Commission: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. గోరంట్ల మాధవ్ వీడియో ఘటనపై విచారణకు మహిళా కమిషన్ సూచించింది. గోరంట్ల వీడియో వ్యవహారంపై సత్వర విచారణ చేయాలని వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. లోకానికి తలవంపులు తెచ్చేలా ఉన్న ఘటనపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒకటి వైరల్ కాగా.. రాజకీయాల్లో దుమారం రేపింది. ఎంపీ ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్‌లో మాట్లాడారంటూ వీడియో బయటకు వచ్చింది. మాధవ్ వెంటనే స్పందించి.. అది మార్ఫింగ్ వీడియో అంటూ వివరణ ఇచ్చారు. తనపై కుట్ర జరిగిందని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో మహిళా కమిషన్ స్పందించింది విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story