చంద్రబాబు, బోండా ఉమా వ్యవహారం సిగ్గుచేటు - వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార బాధితులి పరామర్శలో చంద్రబాబు వ్యవహరించిన తీరు బాధాకరం...

Shireesha
Published on: 27 April 2022 3:28 PM IST
AP Women Commission Chairman Vasireddy Padma about Chandrababu Naidu Bonda Uma | Live News
X

చంద్రబాబు, బోండా ఉమా వ్యవహారం సిగ్గుచేటు - వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి గదిలోకి చంద్రబాబు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు మహిళాకమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ. పేషంట‌్ ఉన్న గదిలోని 100 మందితో ప్రవేశించటం దారుణం అన్నారు. అత్యాచార బాధితురాలి శారీరక మానసిక స్థితిని పట్టించుకోకుండా చంద్రబాబు సమక్షంలో గుంపులుగా పెద్దగా అరవటం ఏంటిని ప్రశ్నించారు.

ఇది ముమ్మాటికీ అత్యాచార బాధితురాలి ప్రతిష్టకు భంగం కలిగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందన్న ఆమె.. కెమెరాలను వెంట తెచ్చుకొని మరీ బాధితురాలి దగ్గరకు రావడం నీచమైన చర్యేనన్నారు. ఓ మహిళా చైర్ పర్సన్ గా బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే వందల మందితో అడ్డగించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బాధితురాలిని కుటుంబ సభ్యులను టిడిపి నాయకులు పదేపదే మీడియా ముందు చూపించటం బాధాకరమన్నారు వాసిరెడ్డి పద్మ.

Shireesha

Shireesha

Next Story