CM Jagan: టీడీపీ హయాంలో ఎక్కడ చూసినా లంచమే వినిపించింది

CM Jagan: టీడీపీ ప్రభుత్వం మనుషులను విభజించి, పాలించింది

Shekhar G
Published on: 15 Feb 2024 5:48 PM IST
AP Volunteers Are The Future Leaders Says CM Jagan
X

CM Jagan: టీడీపీ హయాంలో ఎక్కడ చూసినా లంచమే వినిపించింది

CM Jagan: రూపాయి లంచం తీసుకోకుండా ప్రభుత్వం పథకాలను అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. వివక్ష లేకుండా ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారాయన... గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో ఆ‍యన మాట్లాడారు. రానున్న రోజుల్లో వలంటీర్లు లీడర్లు కాబోతున్నారని, వీరంతా చేస్తున్నది ఉద్యోగాలు కాదని, మీరంతా భావి లీడర్లని అన్నారాయన..

జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను టీడీపీ మోసం చేసిందని, లంచం లేనిదే ఏ పథకమూ ప్రజలకు అందలేదని ఏపీ సీఎం జగన్ అన్నారు. టీడీపీ అధికారంలో నుంచి దిగిపోవడానికి జన్మభూమి కమిటీలే కారణమయ్యాయన్నారు. లంచం, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని అన్నారు. టీడీపీ హయాంలో ఎక్కడ చూసినా లంచమే వినిపించిందని, టీడీపీ ప్రభుత్వం మనుషులను విభజించి, పాలించిందని దుయ్యబట్టారు సీఎం జగన్.

Shekhar G

Shekhar G

Next Story