నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని : రేవతి

Arun Chilukuri
Published on: 10 Dec 2020 4:45 PM IST
నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని : రేవతి
X

గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటనపై ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి స్పందించారు. ముందుగా టోల్ ప్లాజా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం వల్లే తాను కారు దిగాల్సి వచ్చిందని వివరించారు. చట్టం ప్రకారం నడిచే వ్యక్తినని, సదరు టోల్ ప్లాజా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కలుస్తానన్నారు రేవతి. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పూర్తి ఆధారాలతో డీజీపీకి పిర్యాదు చేస్తానన్నారు. చట్టవ్యతిరేక పనులు చేసే వ్యక్తిని కాదని తన కారుకు రెగ్యులర్ పాస్ ఉందని వివరించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story