గుంటూరు జిల్లాలో వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ వీరంగం

గుంటూరు జిల్లాలో వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ వీరంగం
x
Highlights

గుంటూరు జిల్లాలో ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి వీరంగం సృష్టించారు. కాజా టోల్‌ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు....

గుంటూరు జిల్లాలో ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి వీరంగం సృష్టించారు. కాజా టోల్‌ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఫ్రీ పాస్ లేకపోవటంతో రేవతిని టోల్ సిబ్బంది ఆగాలని సూచించడంతో ఆగ్రహంతో ఊగిపోయారామె. నన్నే ఆపుతావా అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అడ్డుగా ఉన్న బారికేడ్‌ను నెట్టడమే కాకుండా అక్కడి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తమ డ్యూటీ తాము చేస్తే బాధ్యత గల పదవిలో ఉండి దేవళ్ల రేవతి దురుసుగా ప్రవర్తించడంపై మండిపడుతున్నారు సిబ్బంది. వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి తమపై దాడి చేశారని కాజ టోల్‌గేట్‌ సిబ్బంది మంగళగిరి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులకు అందజేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories