AP Three Capital Issue: సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

Arun Chilukuri
Published on: 8 Aug 2020 1:18 PM IST
AP Three Capital Issue: సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
X

AP Three Capital Issue: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఆర్డీఏ బిల్లుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారానికి విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఆర్డిఏ, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులపై ఇటీవలే గవర్నర్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతి రైతులు ఈ బిల్లులపై స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణపై స్టేటస్ కో విధించింది. ఆగస్టు 14 లోపు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story