Atchannaidu: ఆరునూరైనా చంద్రబాబే మళ్లీ సీఎం

Atchannaidu: వైసీపీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 27 Dec 2021 5:05 PM IST
AP TDP Chief Atchannaidu Slams YS Jagan govt Over CPS
X

Atchannaidu: ఆరునూరైనా చంద్రబాబే మళ్లీ సీఎం

Atchannaidu: వైసీపీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో విద్యుత్ రంగం చిన్నాభిన్నం అయ్యిందని, టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని సంస్కరించామన్నారాయన. టీడీపీ హయాంలో ప్రజలకు 24 గంటలు, రైతులకు 7 గంటలు విద్యుత్ అందించామని గుర్తుచేశారు. చేతకాని తనంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.

సీపీఎస్ రద్దు చంద్రబాబుకే సాధ్యం కాకపోతే, ఈ పిల్ల కాకితో ఏమి అవుతుందని విమర్శించారు అచ్చెన్నాయుడు. టీడీపీ హయాంలో ఉద్యోగులు, కార్మికులు సంక్షేమం కోసం కృషి చేశామన్నారు. మళ్లీ కార్మిక సంఘాలకు పూర్వ వైభవం వచ్చేలా చేస్తామని తెలిపారు. ఏపీని అస్యహించుకునే స్థితికి తెచ్చారని మండిపడ్డారు. ఏపీ ఆస్తులను తెలంగాణకు దోచిపెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆరు నూరు అయిన మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని బాబు ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మక అవసరమని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story