ఢిల్లీకి చేరిన ఏపీ దొంగ ఓట్ల పంచాయతీ

AP Votes: దొంగఓట్లు తొలగించాలని ఈసీకి విజ్ఞప్తి చేసిన బీజేపీ నేతలు

Shekhar G
Published on: 14 Dec 2023 5:19 PM IST
AP Stolen Votes Panchayat Reached Delhi
X

ఢిల్లీకి చేరిన ఏపీ దొంగ ఓట్ల పంచాయతీ

AP Votes: ఏపీ దొంగఓట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. దొంగఓట్లపై సీఈసీకి వైసీపీ, టీడీపీ, పరస్పర ఫిర్యాదులు చేయగా బీజేపీ కూడా ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ, వైసీపీ పార్టీల ఎంపీలు కలవగా..బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఈసీని కలిసింది. 40.76లక్షల దొంగ ఓట్లను టీడీపీయే చేర్పించిందని వైసీపీ ఆరోపించింది. దొంగ ఓట్లన్ని టీడీపీ నేతల సానుభూతిపరులవే నంటూ వైసీపీ ఎంపీలు ఈసీకి తెలిపారు. కాగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా ఏపీలో వాలంటీర్లు రాజ్యాంగేతర శక్తులుగా మారారని..దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర పాత్ర అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారుల్ని సైతం వాలంటీర్లు భయపెడుతున్నారని టీడీపీ ఆరోపించింది.

Shekhar G

Shekhar G

Next Story