AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

Arun Chilukuri
Published on: 6 Jun 2022 2:27 PM IST
AP SSC Results 2022 Released
X

AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విజయవాడలోని ఎమ్‌జీ రోడ్‌‌లో ఉన్న గేట్‌వే హోటల్‌లో ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.inలో రిజల్ట్స్‌ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. 4.14 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 70.70 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64.02 శాతం మంది పాసయ్యారు. ఏపీ టెన్త్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30 శాతం మంది ఉత్తీర్ణత కాగా అనంతపురంలో అత్యల్పంగా 49.70 శాతం మంది పాసయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story