ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

AP SSC Exams: ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రీపోన్ అయ్యాయి.

Arun Chilukuri
Published on: 18 March 2022 8:10 PM IST
AP SSC Exams Revised Schedule Released
X

ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

AP SSC Exams: ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రీపోన్ అయ్యాయి. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. మే 2 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు ఏప్రిల్‌ 27న మొదలై మే 9 వరకు జరగనున్నాయి. మే 6 నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఉన్నందున అధికారులు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు తాజా షెడ్యూల్‌తో ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

కొత్త షెడ్యూల్‌ ఇదే..

ఏప్రిల్‌ 27.. ఫస్ట్‌ లాంగ్వేజ్,

ఏప్రిల్‌ 28..సెకండ్ లాంగ్వేజ్,

ఏప్రిల్‌29.. ఆంగ్లం,

మే 2.. గణితం,

మే 4.. సైన్స్,

మే 5.. బయోలాజికల్ సైన్స్ ,

మే 6.. సోషల్,

మే 7.. ఓరియంటల్,

మే 9.. వోకేషనల్ పరీక్షలు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story