AP SSC Board Exams 2026: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్: ఏపీ ఎస్ఎస్‌సీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు.. కొత్త తేదీ ఇదే!

AP SSC Board Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది.

Arun Chilukuri
Updated on: 7 Feb 2026 2:07 PM IST
AP SSC Board Exams 2026: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్: ఏపీ ఎస్ఎస్‌సీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు.. కొత్త తేదీ ఇదే!
X

AP SSC Board Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. మార్చిలో రానున్న పండుగల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఒక పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న ఇంగ్లిష్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, ఉగాది మరియు రంజాన్ పండుగల ప్రభావంతో ఆ పరీక్షను ఒక రోజు ముందుకు జరుపుతూ మార్చి 21కి మార్చారు. మిగిలిన పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన తేదీల్లోనే యథావిధిగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ముఖ్యమైన వివరాలు:

పరీక్షల కాలం: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు.

పరీక్ష సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు.

మార్పు: మార్చి 20న జరగాల్సిన పరీక్ష.. ఇప్పుడు మార్చి 21న (శనివారం) జరుగుతుంది.

పకడ్బందీగా ఏర్పాట్లు పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు ఈ మార్పును గమనించి ప్రిపరేషన్ సాగించాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story