రేపు ఉదయం 10 గంటలకు ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

AP SEC Nimmagadda Ramesh release first phase panchayat election notification tomorrow
x

రేపు ఉదయం 10 గంటలకు ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

Highlights

రేపు ఉదయం పది గంటలకు ఏపీ తొలిదఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ మీడియా సమావేశం...

రేపు ఉదయం పది గంటలకు ఏపీ తొలిదఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలపై ప్రకటన చేయనున్నారు. ప్రెస్ నోట్ రిలీజ్ కు మాత్రమే పరిమితం కావాలని ఎస్ఈసీ నిర్ణయించారు. ఎన్నికల నిర్వహాణకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటికి మరో సందర్భంలో సమాధానాలు ఇస్తానని ఎస్ఈసీ స్పష్టం చేశారు. కాగా, నిన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ భేటీ ఆయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తో చర్చించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని గవర్నర్ కు నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories