Andhra Pradesh: ఏపీ ఎస్‌ఈసీ నీలం సాహ్ని కీలక సమావేశం

Andhra Pradesh: ఏపీ నూతన ఎస్‌ఈసీ నీలం సాహ్ని కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 1 April 2021 5:43 PM IST
AP SEC Neelam Sahani Video Conference With Collectors and SPS
X

Andhra Pradesh: ఏపీ ఎస్‌ఈసీ నీలం సాహ్ని కీలక సమావేశం

Andhra Pradesh: ఏపీ నూతన ఎస్‌ఈసీ నీలం సాహ్ని కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్యారోగ్యశాఖ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు నేరుగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌తో చర్చించారు.

ఎస్‌ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్‌ఈసీని సీఎస్ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story