School Holidays: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు..!
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది.
School Holidays: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు..!
School Holidays: ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. హాలీడేస్ అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా.. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వెల్లడిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం వెలువరించింది.
Next Story




