సీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్

Andhra Pradesh: సంప్రదింపుల కమిటీతో సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం

Jyothi
Published on: 18 Aug 2022 7:48 AM IST
AP Sarkar Invited Employees For Discussion On CPS
X

సీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్

Andhra Pradesh: సీపీఎస్ అంశంపై ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించింది. నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలతోపాటు సీపీఎస్‌కు చెందిన ఉద్యోగ సంఘాలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో సంప్రదింపుల కమిటీతో సమావేశానికి రావాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం పలికింది. సచివాలయం రెండో బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 1న సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించడంతో అత్యవసరంగా సీపీఎస్ రద్దు అంశంపై ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.


Jyothi

Jyothi

Next Story