Covishield: ఏపీకి మరో 9 లక్షల కోవిషీల్డ్‌ టీకా డోసులు

Covishield: ఆంధ్రప్రదేశ్‌కు భారీగా కోవిషీల్డ్‌ టీకా డోసులు చేరుకున్నాయి.

Arun Chilukuri
Updated on: 17 Jun 2021 8:16 PM IST
Ap Receives Nine Lakh Covishield Vaccine Doses
X

Covishield: ఏపీకి మరో 9 లక్షల కోవిషీల్డ్‌ టీకా డోసులు

Covishield: ఆంధ్రప్రదేశ్‌కు భారీగా కోవిషీల్డ్‌ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు 9 లక్షల డోసులు గురువారం చేరాయి. కొవిషీల్డ్ టీకా డోసులు పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి.

తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ తరలి వెళ్లనుంది. అక్కడి నుంచి ఆయా జిల్లాలకు అవసరాలకు అనుగుణంగా వీటిని సరఫరా చేయనున్నారు. టీకాలు అందడంతో పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story