AP Privilege Committee: నేడు ఏపీ ప్రివిలేజ్ కమిటీ భేటీ

* ఇవాళ విచారణకు హాజరుకావాలని అచెన్నాయుడుకి కమిటీ ఆదేశం * కూన రవికుమార్‌పై ప్రివిలేజ్ కమిటీ సీరియస్

Sandeep Reddy
Updated on: 14 Sept 2021 9:30 AM IST
AP Privilege Committee Meeting Today 14 09 2021
X

నేడు ఏపీ ప్రివిలేజ్ కమిటీ భేటీ (ఫైల్ ఫోటో)

AP Privilege Committee: నేడు ఏపీ ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత విచారణకు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ ప్రివిలేజ్ కమిటీకి హాజరుకాలేదు. దీంతో నేడు మరోసారి అవకాశం ఇచ్చారు. గతంలో వ్యక్తిగత కారణాల వద్ద హాజరు కాలేనని అచ్చెన్నాయుడు సమాచారం అందించగా నేడు రావాలని కమిటీ ఆదేశించింది.

అయితే కూన రవిని వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. కూన రవిది ధిక్కారంగా భావిస్తున్నామని అతనిపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీకి సిఫార్సు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అటు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై వచ్చిన్న ఫిర్యాదుపై కూడా కమిటీ చర్చించనుంది. తన వ్యాఖ్యలు ఏ విధంగా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయో చెప్పాలని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు కోరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story