ఏపీ పాలీసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ పాలీసెట్‌ ఫలితాలు విడుదల
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పాలీసెట్‌-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విజయవాడ ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌...

ఆంధ్రప్రదేశ్‌లో పాలీసెట్‌-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విజయవాడ ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్‌ పాలిసెట్‌‌ ఫలితాలను విడుదల చేశారు. పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,631 మంది విద్యార్థులు హాజరుకాగా 60,780 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 50,706 మంది పరీక్షలు రాయగా 42,313 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 20,925 మంది పరీక్షలు రాయగా 18,467 మంది ఉత్తీర్ణత సాధించారు. పశ్చిమ గోదావరికి చెందిన మట్టా దుర్గా సాయి కీర్తి తేజ 120 మార్కులతో టాప్ 1 లో నిలిచారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుంకర అక్షయ ప్రణీత్ 119 మార్కులతో రెండో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సవిలత శ్రీదత్త శ్యామ సుందర్ 118 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories