బీసీల కేంద్రంగా ఏపీలో రాజకీయాలు

బీసీల కేంద్రంగా ఏపీలో రాజకీయాలు
x
Highlights

ఏపీ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీలకు మేం న్యాయం చేశామంటే..మేం న్యాయం చేశామంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి....

ఏపీ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీలకు మేం న్యాయం చేశామంటే..మేం న్యాయం చేశామంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. బీసీలకు కేరాఫ్ అడ్రస్‌ మా పార్టీయేనని టీడీపీ నేతలుచెబుతుంటే మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది బీసీలేనంటూ అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇలా రెండు పార్టీలు బీసీల జపం చేస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు బీసీ ఇష్యూ చుట్టూ తిరుగుతోంది.

బీసీల కేంద్రంగా ఏపీలో రాజకీయాలు తిరుగుతున్నాయి. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు తమ వైపే ఉన్నారంటూ టీడీపీ, వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. బీసీలను అగౌరపరిచారని అధికార పార్టీ బీసీలను మోసం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. 56 బిసి కార్పొరేషన్‌లకు చైర్మన్లను ప్రకటించి బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చెయ్యడమే తమ లక్ష్యమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతే కాకుండా బీసీల సంక్షేమం కోసం 16 నెలల్లో 33 వేల 500 కోట్లు ఖర్చు చేశామని అధికార పార్టీ నేతలు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

బీసీలను మోసం చేయడానికే పదవుల పందేరం అంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. బిసీ సంక్షేమ నిధులు 23 వేల కోట్లను నవరత్నాలు కార్యక్రమాలకు దారిమల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీసీలను న్యాయం చేసింది తామేనని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బిసి నేతను నియమించామని చెబుతున్నారు. బీసీలను మోసం చేసి మూడు రోజుల పండగ అంటూ వంచన చేస్తున్నారని వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీ రాజకీయం రానున్న రోజుల్లో ఎటువంటి పొలిటికల్‌ టర్న్ తీసుకుంటుందో అనే ఆశక్తి సర్వత్రా నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories