BROకు పోటీ‌గా MRO సినిమా తీస్తామన్న అంబటి.. MROకి కౌంటర్‌గా SSS అంటూ పోస్టర్ రిలీజ్ చేసిన జనసేన

AP Politics: ఏపీలో సినిమా రగడ కొనసాగుతోంది. వైసీపీ, జనసేన నేతలు పోటాపోటీగా సినిమాల యుద్ధం చేస్తున్నారు.

Arun Chilukuri
Published on: 2 Aug 2023 2:39 PM IST
AP Politics Heats up: YSRCP and Jana Sena Clash Over BRO Movie
X

BROకు పోటీ‌గా MRO సినిమా తీస్తామన్న అంబటి.. MROకి కౌంటర్‌గా SSS అంటూ పోస్టర్ రిలీజ్ చేసిన జనసేన

AP Politics: ఏపీలో సినిమా రగడ కొనసాగుతోంది. వైసీపీ, జనసేన నేతలు పోటాపోటీగా సినిమాల యుద్ధం చేస్తున్నారు. గతంలో వైసీపీ, టీడీపీ మధ్య వ్యూహం, ప్రతివ్యూహం అంటూ సినిమా పంచాయితీ నడవగా.. తాజాగా బ్రో సినిమా మరో మూవీ వార్‌కు దారి తీసింది. సినిమాలో శాంబాబు క్యారెక్టర్ తో మొదలైన రాజకీయ రచ్చ కాస్త ముదిరింది. పవన్‌ తీసిన BROకు పోటీ‌గా MRO సినిమా తీస్తామన్నారు అంబటి. మ్యారేజ్, రిలేషన్స్‌, అఫెండర్ పేరుతో పవన్‌పై సినిమా తీస్తామన్నారు. దీంతో జనసేన కూడా కౌంటర్‌గా సినిమా తీస్తున్నామంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రొడక్షన్ నెంబర్ 6093 సందులో సంబరాల శాంబాబు అలియాస్‌ రాంబాబు అనే సినిమా తీస్తున్నట్లు తెలిపింది. క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించారు జనసేన నేతలు.

మరోవైపు బ్రో మూవీ రగడ బ్లాక్ మనీపైనా చర్చకు తెరతీసింది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ టీడీపీ తరపున పవన్ కల్యాణ్ కు పొలిటికల్ ప్యాకేజీని రెమ్యూనరేషన్ రూపంలో ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు మంత్రి అంబటి. ఇక ఇదే అంశంపై ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు మంత్రి అంబటి. బ్రో మూవీ లావాదేవీలపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story