ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ పుట్టిస్తున్న వైఎస్ విజయమ్మ రాజీనామా

*విజయమ్మ రాజీనామాతో జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు

Rama Rao
Updated on: 9 July 2022 5:30 PM IST
AP Politics Heat on YS Vijayamma Resignation | AP News
X

ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ పుట్టిస్తున్న వైఎస్ విజయమ్మ రాజీనామా

Andhra Pradesh: విజయమ్మ రాజీనామా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. విజయమ్మ రాజీనామాపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కుటుంబం మొత్తాన్ని జగన్ వదిలేశాడని ప్రతిపక్ష టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది. ఇప్పటికే సొంత చెల్లిని వదిలేశాడని ఇప్పుడు కన్న తల్లిని వదిలించుకున్నాడని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అటు అధికార వైసీపీలోనూ అమ్మ రాజీనామాపై అంతర్గతంగా నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో ఎక్కడా విజయమ్మ ఫోటో కన్పించకపోవడంతో ఇదంతా ముందస్తు ప్లానే అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ప్లీనరీ వేదికగా విపక్షాల ఆరోపణలను సీఎం జగన్ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయంతో విపక్షాలకు చెక్ పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story