Vijayawada - Gold Mafia: విజయవాడలో గోల్డ్‌ మాఫియా గుట్టురట్టు

Vijayawada - Gold Mafia: * ముందుగానే కస్లమర్ల నుంచి ఆర్డర్ల వసూళ్లు * 2018 నుంచి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న దందా

Shireesha
Published on: 5 Sept 2021 11:30 AM IST
AP Police Traced Gold Mafia Case in Vijayawada | AP Live News
X

విజయవాడలో గోల్డ్‌ మాఫియా గుట్టురట్టు

Vijayawada - Gold Mafia: విజయవాడలో దశబ్ధకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న గోల్డ్‌ మాఫియా గుట్టురట్టు అయ్యింది. సౌది నుంచి స్మగ్లింగ్‌ ముఠా నగరానికి బంగారాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. 5లక్షల విలువగల బంగారం బిస్కెట్‌ను 4లక్షలకే అమ్ముతున్నారు. కస్టమర్ల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకొని అమ్మకాలు జరుపుతున్నారు.

తాజాగా బాధితుల నుంచి 6కోట్లు వసూలు చేశారు. 2018 నుంచి ఈ దందా కొనసాగుతోంది. అయితే గత 4నెలల నుంచి గోల్డ్‌ డెలివరికి బ్రేక్‌ పడడంతో ఆర్డర్‌ ఇచ్చిన కొందరు గొడవకు దిగారు. దీంతో స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్న రాఘవేంద్రరావు, వెంకటేశ్వరరావు, నాగమణిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం కోసం ఆర్డర్లు ఇచ్చిన నగదు బ్లాక్‌ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story