Punganur: పుంగనూరు ఘటనపై ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రియాక్షన్

Punganur: ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని ఆరోపణ

Shekhar G
Published on: 5 Aug 2023 6:07 PM IST
AP Police Officers Association Reaction To Punganur Incident
X

Punganur: పుంగనూరు ఘటనపై ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రియాక్షన్

Punganur: చిత్తూరు జిల్లా పుంగనూరులో పోలీసులపై జరిగిన దాడిని పోలీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. పుంగనూరు పర్యటనలో చంద్రబాబు రోడ్ మ్యాప్ ఉల్లంఘనకు పాల్పడిండ్డారని పోలిస్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు పట్టణంలోకి ప్రవేశించి విధ్వంసకాండ సృష్టించారన్నారు. ప్రజాస్వామ్యానికి రక్షణ గోడలుగా నిలిచే పోలీసుల పై దాడి హేయమైన చర్యని అన్నారు. పోలీస్ శాఖ అధికారులు ఎంత నచ్చచెప్పిన టీడీపీ కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరన్నారు. కేవలం ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో అల్లర్లు సృష్టించాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నాలు చేశాయన్నారు. ప్రణాళిక ప్రకారమే పోలీసులపై రాళ్లదాడి జరిగిందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story