పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నోటీసులు.. సాయంత్రం 4 గంటలలోపు విశాఖ వీడాలని..

AP Police Notice to Pawan Kalyan To Leave Visakhapatnam
x

పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నోటీసులు.. సాయంత్రం 4 గంటలలోపు విశాఖ వీడాలని..

Highlights

Pawan Kalyan: విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటనకు, జనవాణి కార్యక్రమానికి పోలీసులు ఆటంకం కలిగించారు.

Pawan Kalyan: విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటనకు, జనవాణి కార్యక్రమానికి పోలీసులు ఆటంకం కలిగించారు. నోవాటెల్ హోటల్‌లో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్‌కు పోలీసులు 41ఎ నోటీసులు జారీ చేశారు. పోలీసు అధికారులు ఇచ్చిన నోటీసులతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. నోటీసును చదివిన పవన్‌ ఇంతకీ ఈ నోటీసు ఎందుకిచ్చారని పోలీసు అధికారులను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బసచేస్తున్న హోటల్‌‌ను ఖాళీచేసి సాయంత్రం 4 గంటలలోపు విశాఖ విడిచి వెళ్లాలని సారాంశమని పోలీసులు వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాలని పోలీసు అధికారులు పవన్ కళ్యాణ్‌‌కు విన్నవించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories