టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10మంది అరెస్ట్

Mangalagiri: మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు.

Arun Chilukuri
Published on: 23 Oct 2021 3:57 PM IST
AP Police Arrested 10 Persons in TDP Office Attack
X

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10మంది అరెస్ట్

Mangalagiri: మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో 10మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శేషగిరి, పవన్‌, అడపాల గణపతి, షేక్‌ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్‌, పానుగంటి చైతన్య, పల్లపు మహేశ్‌, పేరూరి అజయ్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో పట్టాభి ఇంటిపై దాడి కేసులోనూ 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు వెల్లడించారు.

మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యాలయ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. విచారణలో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషనుకు వచ్చి వివరాలు అందివ్వాలని నోటీసులు జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story