ఏపీ పంచాయతీ ఎన్నికలు: ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు నామినేషన్లు

ఏపీ పంచాయతీ ఎన్నికలు: ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు నామినేషన్లు
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. తొలిరోజు నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 339 ...
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. తొలిరోజు నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 339 పంచాయతీల్లో మొదటి దశలో ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినా.. వివిధ కారణాలతో 90 పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లు స్వీకరించేందుకు పెద్ద పంచాయతీల్లో రిటర్నింగ్ అధికారులను నియమించారు. మిగిలిన చోట్ల సహాయ రిటర్నింగ్, స్టేజి-1 అధికారులను కలెక్టర్లు నియమించారు. తొలి దఫాలో ఎన్నికలు జరిగే చోట్ల ఇవాళ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు.
మరోవైపు.. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకునేవారు ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేయాలి. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. అప్పటి నుంచి 3 రోజులపాటు వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9న ఎన్నికలు నిర్వహించనున్నారు.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
కరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMTVisakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
28 Jun 2022 1:16 AM GMTఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
28 Jun 2022 1:02 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTIndian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్ ఎయిర్...
27 Jun 2022 3:30 PM GMT