కుప్పంలో టీడీపీ భవితవ్యం తేలేదీ రేపే

కుప్పంలో టీడీపీ భవితవ్యం తేలేదీ రేపే
x
Highlights

మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలాకాలో టీడీపీ భవితవ్యం మూడో దశ ఎన్నికల్లోనే తేలనుంది. ఇప్పటివరకు తెలుగుదేశం జెండా మాత్రమే ఎగిరిన కుప్పంలో...

మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలాకాలో టీడీపీ భవితవ్యం మూడో దశ ఎన్నికల్లోనే తేలనుంది. ఇప్పటివరకు తెలుగుదేశం జెండా మాత్రమే ఎగిరిన కుప్పంలో ఈసారి వైసీపీ గట్టి పోటీ ఇస్తోంది. కుప్పంలో టీడీపీ కోటను కూల్చడానికి మంత్రి పెద్దిరెడ్డి చాలాకాలం క్రితమే ఆపరేషన్‌ స్టార్ట్‌ చేశారు. సొంత నియోజకవర్గంలో దెబ్బ తగిలే పరిస్థితులు రావడంతో కుప్పంలో మెజారిటీ గ్రామాలను గెలుచుకోవడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. 2019 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు, లోకేష్ కుప్పం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాంతో, క్యాడర్ లో కొంత పట్టు తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే సర్పంచ్ స్థానాల్లో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు. వార్డుల్లో మాత్రం 284 ఏకగ్రీవమయ్యాయి. పరువు దక్కించుకోవడం కోసం టీడీపీ పడరాని పాట్లు పడుతుంటే చంద్రబాబును పడగొట్టడం కోసం వైసీపీ తనదైన శైలీలో వ్యవహరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories