logo
ఆంధ్రప్రదేశ్

ఏపీ వ్యాప్తంగా ముగిసిన రెండో విడత పంచాయతీ పోలింగ్

ఏపీ వ్యాప్తంగా ముగిసిన రెండో విడత పంచాయతీ పోలింగ్
X

ఏపీ వ్యాప్తంగా ముగిసిన రెండో విడత పంచాయతీ పోలింగ్

Highlights

ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 18 రెవెన్యూ...

ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్‌ జరిగింది. వాటిలో 2 వేల 786 సర్పంచ్‌ స్థానాలు, 20 వేల 817 వార్డు స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్‌ కొనసాగింది. మొదటి దశలో మాదిరిగానే రెండో దశలోనూ ఓటర్లు ఓటు వేసేందుకు పోటెత్తారు. మధ్యాహ్నం 02.30 గంటల వరకు 76.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

మరోవైపు 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 33 వేల 570 వార్డులుండగా 12 వేల 604 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డులలో నామినేషన్లు దాఖలవలేదు. దీంతో మిగిలిన 20 వేల 817 వార్డులకు పోలింగ్‌ జరిగింది. ఈ వార్డుల్లో 44 వేల 876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. లెక్కింపు ప్రారంభించిన అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు.

Web TitleAP Panchayat Election 2021 Phase 2 Voting Ends
Next Story